రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. రామ రావణ రాజ్యం టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాను డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడట.


ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం కీరవాణి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారట. సాంగ్స్ కంపోజిషన్ జరుగుతుందట. బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు సుద్ధాల అశోక్ తేజ సాహిత్యం అందిస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ కోసం సుద్ధాల అశోక్ తేజ పర్ఫెక్ట్ ఆప్షన్ అని రాజమౌళి అతనికే ఓటు వేశారని తెలుస్తుంది.


ఇప్పటికే తన పెన్ పవర్ తో ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన సుద్ధాల అశోక్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసిం హా రెడ్డికి పాటలు రాస్తున్నారు. ఆ సినిమా తర్వాత అంత ప్రెస్టిజియస్ మూవీగా వస్తున్న ఆర్.ఆర్.ఆర్ కు అశోక్ తేజ పాటలు రాస్తున్నారు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ మూడవ షెడ్యూల్ కోసం కలకత్తా వెళ్లనుంది.


ఈ ప్రెస్టిజియస్ మూవీలో నటించే హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. పరిణితి చోప్రా, అలియా భట్ లతో చర్చలు జరిపారని తెలుస్తుంది. అయితే పరిణితి చోప్రా కష్టమే అని తెలుస్తుండగా అలియా భట్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. గురువారం రాజమౌళి ఈ సినిమాకు సంబందించి ఓ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: