‘సాహో’ తెలుగుతో పాటు హిందీలో కూడ విడుదల కాబోతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సంబంధించిన ఒక పోస్టర్ ను ముంబాయ్ లోని ఒక ప్రముఖ మల్టీ ప్లేక్స్ ధియేటర్ ప్రాంగణంలో ఈమధ్య పెట్టారు. అయితే ఆ పోస్టర్ ఇప్పటి వరకు అధికారికంగా ‘సాహో’ యూనిట్ నుండి విడుదల కాలేదు.

ఆ పోస్టర్ విపరీతంగా ముంబాయ్ లోని ఆ ధియేటర్ కు వచ్చే ప్రేక్షకులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ వీరాభిమాని ఒకరు ఆ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ పోస్టర్ కు ప్రభాస్ లుక్ కు వస్తున్న ప్రశంసలు గురించి వివరించారు. అయితే ఇప్పుడు ఈవిషయమే ప్రభాస్ పోస్టర్ పై విపరీతమైన సెటైర్లు పడేలా చేసింది.
Prabhas’s Sahoo was offered to top Bollywood actresses
అనేకమంది ‘సాహో’ లోని ఆ పోస్టర్ పై కామెంట్ చేస్తూ ఆ పోస్టర్ 2013లో విడుదలైన టామ్ క్రూఈస్ ‘ఓబ్లివియన్’ మూవీలోని టామ్ క్రూఈస్ లుక్ కు పూర్తి కాపీగా ఉందని ప్రభాస్ చేతిలోని గన్ అదేవిధంగా వెనుక కనిపించే బిల్డింగ్ బ్యాక్ డ్రాప్ అంతా హాలీవుడ్ సినిమాకు అనుసరణగా కనిపిస్తోంది అంటూ కొంతమంది ప్రభాస్ లుక్ పై సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు మరికొందరైతే ఇప్పటికే గతంలో విడుదలైన ‘సాహో’ ఫస్ట్ లుక్ హాలీవుడ్ మూవీ ‘బ్లేడ్ రన్నర్ 2049’ ని పోలి ఉన్న నేపధ్యంలో ‘సాహో’ మూవీ అంతా హాలీవుడ్ సినిమాలకు కాపీగా ఉంటుందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Saaho first look,Saahofirstlook,Prabhas Saaho
ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా గ్రాఫిక్స్ టెక్నాలజీ విషయంలో హాలీవుడ్ స్థాయిలో ఉన్నా సినిమాలకు సంబంధించి మన తెలుగు నేటివిటీ కనిపించకపోతే ఆసినిమాలను గతంలో ప్రేక్షకులు ఘోరంగా రిజెక్ట్ చేసారు. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ ‘సాహో’ లుక్ గురించి మాత్రమే కాకుండా కథ విషయంలో శ్రద్ద పెట్టకపోతే 250 కోట్ల సినిమా కూడ 25 రోజులు కూడ ఆడని పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ విమర్శలను ప్రభాస్ మరియు అతడి టీమ్ ఎంత వరకు పట్టించుకుంటారో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: