సినిమాలు ఎంత ఎంటర్టైన్ చేసినా ప్రతి రోజు కాసేపు ఎంటర్టైన్ అవ్వాలంటే మాత్రం అది బుల్లితెర వల్లే సాధ్యం. ఇక స్మాల్ స్క్రీన్ పై తమ టాలెంట్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న కొందరు వారి కెమిస్ట్రీతో కూడా అదరగొడుతున్నారు. బుల్లితెర మీద క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్, రష్మి.


జబర్దస్త్ షోలో సుధీర్ కంటెస్టంట్ కాగా యాంకర్ గా రష్మి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం చూసి ఇద్దరిని ఢీ షోలో టీం లీడర్స్ గా సెలెక్ట్ చేశారు. జబర్దస్త్ లో కన్నా సుధీర్, రష్మిల హంగామా ఢీ లో ఎక్కువైంది. ప్రతిసారి ఆమెను ఇంప్రెస్ చేసేందుకు సుధీర్ పడే పాట్లు షోని బాగా పాపులర్ అయ్యేలా చేస్తుంది.


కేవలం డ్యాన్స్ షో అంటే వాటినే చూపించకుండా కావాల్సినంత కామెడీ పంచుతూ అలరిస్తున్నారు. ఇక సుధీర్, రష్మిల జోడి కూడా స్మాల్ స్క్రీన్ ను షేక్ చేస్తుందని చెప్పొచ్చు. మంచి సాంగ్ వస్తే సుధీర్, రష్మిలు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఈ ఇద్దరు జోడీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిన్న బుధవారం ఎపిసోడ్ లో కూడా సుధీర్, రష్మిలు తమ డ్యాన్స్ తో అలరించారు.


సుధీర్ ను ఎప్పుడు టీజ్ చేస్తూ పక్కన ప్రదీప్ కూడా బాగా చేస్తున్నాడు. అయితే స్మాల్ స్క్రీన్ కు మాత్రమే పరిమితమైన ఈ జంటని సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూస్తామన్నది అభిమానుల డౌట్. నిన్న జరిగిన ఎపిసోడ్ లో జడ్జ్ గా చేస్తున్న పూజా కూడా మీరు సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించాలని కోరింది. సుధీర్ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి సుధీర్, రష్మి ఓ లవ్ స్టోరీ చేస్తే తప్పకుండా మంచి ఆదరణ లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: