ఎట్టకేలకు నిన్న అర్దరాత్రి ‘జనసేన’ ఎన్నికలలో పోటీ చేసే 32 మంది ఎమ్ఎల్ఏ అభ్యర్ధుల మొదటి లిస్టు విడుదలైంది. అయితే ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం అభిమానులకు అదేవిధంగా ‘జనసేన’ వర్గాలకు షాక్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ స్థాయి లాంటి వ్యక్తికి తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇప్పటికీ క్లారిటీ లేకపోవడం అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.  
Pawan Kalyan Porata Yatra Breaks again Because Of Security Reason
వాస్తవానికి పవన్ పోటీ చేసే నియోజక వర్గానికి సంబంధించిన క్లారిటీ మొదటి లిస్టులోనే వస్తుంది అన్న ఊహాగానాలు వచ్చాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న గాజువాక పిఠాపురం తిరుపతి ప్రాంతాలలో ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలి అన్న విషయమై కూడ పవన్ కు కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్. 

దీనికితోడు పవన్ పోటీ చేసే నియోజక వర్గం ముందుగా ప్రకటిస్తే పవన్ ను కనీసం ఎమ్ఎల్ఏ గా కూడ అవ్వకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రత్యర్ధి పార్టీలు బలమైన అభ్యర్ధిని నిలబెట్టితే పవన్ ఇరుకున పడే సమస్య ఉంటుందని పవన్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు టాక్. దీనికితోడు తాను ఏ స్థానం నుండి పోటీ చేస్తే గెలుపు గ్యారెంటీ అన్న విషయమై కూడ పవన్ కు క్లారిటీ లేదు అని అంటున్నారు. 

ఇలాంటి పరిస్థుతుల మధ్య రాజమండ్రిలో జరగబోతున్న ‘జనసేన’ ఆవిర్భావ వార్శికోత్సవం కోసం పవన్ అభిమానులను ఉభయగోదావరి జిల్లాల నుండి భారీ సంఖ్యలో రాజమండ్రి మీటింగ్ కు తీసుకురావడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పవన్ ప్రకటించబోయే ఎన్నికల మ్యానిఫెస్టో పై అందరి దృష్టి ఉంది. అయితే పవన్ ఇప్పటికీ తాను ఎక్కడ నుండి పోటీ చేస్తాడో ధైర్యంగా క్లారిటీ ఇవ్వకుండా తన అభిమానులకు అదేవిధంగా ‘జనసేన’ కార్యకర్తలకు ఏ విధంగా ధైర్యం చెపుతాడు అంటూ కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: