తెలుగు ఇండస్ట్రీలో దేవదాసు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హీరో రామ్.  ఈ చిత్రంతోనే గోవా బ్యూటీ ఇలియానా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  అయితే స్టార్ హీరోల వరుసగా ఛాన్సులు దక్కించుకోవడంతో ఇలియానా నెంబర్ వన్ హీరోయిన్ రేస్ లోకి వెళ్లింది..కానీ మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ కి జంప్ చేసి ఢీలా పడిపోయింది.  ఇక రామ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలు ఏవీ చెప్పుకోదగ్గ హిట్స్ మాత్రం కాలేదు. 


అప్పట్లో ఢీ..ఇటీవల నేను శైలజ మంచి విజయాలు అందుకున్నాయి.  ఇక డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ‘టెంపర్’తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు.  ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’రూపొందుతుంది.  ఈ చిత్రంలో రామ్ సరికొత్త రూపంలో కపినించబోతున్నాడట.  గతంలో చాలా సుకుమారంగా ఉంటూ వచ్చిన రామ్..ఈ చిత్రంలో చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపించబోతున్నాడట. 

Image result for ismart shankar

 సిక్స్ ప్యాక్ తో కండల వీరుడిలా కనిపించబోతున్నాడట..ఇందుకోసం ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నాడట. రీసెంట్ గా సోషల్ మీడియాలో రామ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న ఈ హీరోకు ఇప్పుడు మరింత క్రేజ్ పెరిగేలా ఉంది. బరువైన డంబుల్స్ పట్టుకొనిక్ జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు. మరి ఈ చిత్రం హిట్ కావడం పూరి, రామ్ కి ఎంతో అవసరం. 


మరింత సమాచారం తెలుసుకోండి: