ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబందించి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అలూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. ఫ్రీడం కోసం ఫైట్ చేసిన ఈ ఇద్దరు రియల్ హీరోస్ వారు అసలు వారు అలా మారడానికి కారణం ఏంటన్నది ఫిక్షన్ కథతో ఆర్.ఆర్.ఆర్ వస్తుందని అన్నారు.


1920లో జరిగే కథగా ఈ సినిమా వస్తుందని అన్నారు రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ గురించి బిగ్ ఎనౌన్స్ మెంట్ చేశాడు రాజమౌళి. సినిమాలో చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్.టి.ఆర్ కు జోడీగా డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుందని వెళ్లడించారు. ఇక సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారని తెలిపారు.


ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అజయ్ దేవగన్ కనిపిస్తారని అన్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా పెద్ద స్కేల్ లో తెరకెక్కుతుందని. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుందని అన్నారు నిర్మాత డివివి దానయ్య. ఇక ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకు ఇద్దరు హీరోలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.


ఆర్.ఆర్.ఆర్ తప్పకుండా మళ్లీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పబోతుందని తెలుస్తుంది. తెలుగు రియల్ హీరోస్ కథతో వస్తున్న ఈ ఆర్.ఆర్.ఆర్ అన్ని 10 భాషల్లో రిలీజ్ అవుతుంది. అన్ని చోట్ల ఆర్.ఆర్.ఆర్ టైటిల్ తోనే వస్తుంది. అయితే లాంగ్వేక్ తగినట్టుగా ఆర్.ఆర్.ఆర్ అబ్రివేషన్ ఉంటుందని అన్నారు. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ తో మళ్లీ రాజమౌళి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: