రాజమౌళి సినిమా కొమురం భీం, అల్లూరి సీతారామరాజు గురించి ఉండబోతుందని తెలిసిపోయింది. స్వయంగా రాజమౌళి ప్రకాటించేశారు. అయితే మనలో  ఎక్కువ మందికి అల్లూరి సీతా రామ రాజు గురించి తెలుసు కానీ కొమురం భీం గురించి పెద్దగా తెలియదు. అస్సలు కొమురం భీం చరిత్ర ఏంటంటే, అది 1901 సంవత్సరం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా సంకేపల్లి గ్రామం.. కొమురం చిన్నూమ్ -సోంబాయి దంపతులకు కొమురం భీమ్ జన్మించాడు. అప్పటికే తెలంగాణపై నిజాం నవాబు సాగిస్తున్న దోపిడీ దౌర్జన్యాలు పెరిగిపోయాయి.

తారక్ పక్కన నటించనున్న డైజీ అడ్గార్జియోన్స్ చూశారా ..!

భీం పిల్లాడుగా ఉన్నప్పుడు పదిహేడేళ్ల వయసులో నిజాం అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో ఆయన తండ్రి చిన్నూమ్ మరణించాడు. దీంతో భీం కుటుంబం కెరిమెరి ప్రాంతంలోని సర్ధాపూర్ కు వలసవెళ్లింది. అక్కడ అడవిని నరికి సాగు చేసుకుంటున్న భీం కుటుంబం భూమిని సిద్ధిఖీ అనే జమీందర్ ఆక్రమించాడు. ఆవేశం పట్టలేని భీమ్ సిద్ధిఖీని హతమార్చి నిజాం నవాబులు ఏమైనా చేస్తారన్న భయంతో అస్సాం పారిపోయాడు. ఐదేళ్ల పాటు కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపాడు.

Image result for komaram bheem

తిరిగి ఐదేళ్ల తర్వాత కెరిమెరి చేరుకున్నాడు. నిజాం నవాబు గిరిజన పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపైకి నడిపించి ఉద్యమించాడు. జోడెఘాట్ గుట్టలు కేంద్రం గిరిజనులను సైన్యంగా మార్చి గెరిల్లా పోరాటాన్ని చేశాడు. నిజాం నవాబుపై తుపాకులు చేతబట్టి ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహీ ఇచ్చిన సమాచారంతో 1940 అక్టోబర్ 27న జోడెఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని నిజాం సేనలు ముట్టడించి భీమ్ ను హతమర్చాయి. ఇదీ కథ.. ఇందులో ఎంతో స్పైసీ కంటెంట్ ఉంది. ఈ పాత్రలో ఎన్టీఆర్ ఇక ఎలా ఇరగదీస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: