సాధారణంగా ప్రమాదాలు ఏ వైపు నుంచి పొంచి ఉంటాయో తెలియదు. కానీ కొంత మంది అదృష్టం కొద్ది ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు.  తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. తమిళ నాట రజినీకాంత్ తర్వాత మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో తల‌ప‌తి విజ‌య్ ఒక‌రు.  ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానుల కోలహలం మామూలుగా ఉండదు.  ప్ర‌స్తుతం త‌న 63వ సినిమాగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చెన్నై శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీలో చిత్రీకరణ జరుగుతోంది. 

అక్కడ తన అభిమానులు చాలా మంది ఉండటంతో వారిని పలుకరించేందుకు విజయ్ వెళ్లారు.  అభిమానుల‌కి మ‌ధ్య ఓ ఇనుప కంచె అడ్డంగా ఉంది. భారీగా గుమిగూడిన అభిమానులు విజ‌య్ రాగానే ఒక్క‌సారిగా కంచె వైపు దూసుకురావ‌డంతో విజయ్ పై కంచె ఒరిగింది.  ఉన్నట్టుండి కంచె మీద పడటంతో తన రెండు చేతులతో ఆపే ప్రయత్నం చేయబోయాడు..కానీ అప్పటికే బాడిగాడ్స్..అనుచరులు అడ్డుకున్నారు.   

దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. కంచె క‌నుక విజ‌య్ మీద ప‌డి ఉంటే, ఆ స‌మ‌యంలో అభిమానులు ఒక్క‌సారిగా దూసుకొచ్చింటే ప‌రిస్థితి వేరేలా ఉండేదేమో అని నెటిజ‌న్స్ అంటున్నారు.  సాధారణంగా ఈ మద్య స్టార్ హీరోలకు ఇలాంటి ఛేదు అనుభవాలు బాగానే జరుగుతున్నాయి.  గతంలో విజయ్ అభిమానులు ఒక్కసారే మీదకు దూసుకు రావడంతో గాయాలు కూడా అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: