నిన్న  రాజమౌళి  నిర్వహించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మీడియా మీట్ లో రాజమౌళి తెలివిగా చేసిన మోసం బయటపడింది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఈ మూవీలో హీరోలు అయిన ఇద్దరు యువకులు దేశభక్తులుగా మారిన వైనం ‘ఆర్ ఆర్ ఆర్’ లో చూపించబోతున్నట్లు రాజమౌళి స్పష్టంగా చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు  అలనాటి స్వాతంత్రోధ్యమ నేపధ్యంలో  ఎలా దేశభక్తులుగా మారారు  అనే పాయింట్ చుట్టూ కథ అంటే ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ కు క్రేజ్ ఏర్పడదు కాబట్టి   రాజమౌళి తెలివిగా కొమరం భీమ్ అల్లూరిల కథలోని తెలియని కోణం అనే మసాలా పాయింట్ ను  తగిలించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.   
అలా చేస్తే సినిమాలో రసం ఉండదు
స్వాతంత్ర ఉద్యమకాలంలో మన ప్రాంత ఇళ్ళ నుంచి నార్త్ కు వెళ్లిన యువకులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోన్నారు ఎవరిని ఎదిరించి పోరాడారు అలాంటి టైమ్ లో వారిలోని పోరాట పటిమను గమనించి ఎవరు  వారిని ప్రభావితం చేసారు ఈ విషయంలో వారికి ఎదురైన   సంఘటనలు ఎక్కువగా ఈ కధలో ఉంటాయని టాక్. అయితే ఈకథలో కొత్త పాయింట్ కనిపించదేమో అన్న భావంతో అల్లూరి కొమరం బీమ్ ల ప్రభావం అనే పాయింట్ ఉంటె ప్రేక్షకులలో ఉద్వేగం తీవ్ర స్థాయిలో ఉంటుంది అని రాజమౌళి తెలివిగా అల్లూరి కొమరం భీమ్ ల ప్రస్తావన  తీసుకు వచ్చినట్లు కామెంట్స్ వస్తున్నాయి. 
బ్యాలెన్స్ అనేది ఆ విషయంలో ఉండాలి
ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన మీడియా మీట్ లో జూనియర్ చరణ్ లు ఇద్దరు టోపీలు పెట్టుకుని రావడం వెనుక ఒక కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో రామ్ చరణ్ మీసం ఇలా ఉండదు అని తెలుస్తోంది. ఇదే మీసం  ఇంకా పొడవుగా ఉంటూ   చివరిన పైకి మెలితిరిగి ఉంటుంది అని టాక్. 
అదే మాకు ప్లస్ అయింది
దీనితో చరణ్  అసలు మీసం కనపడకుండా,దాన్ని కిందకు దువ్వేసి బాగా నొక్కిపెట్టి తల పై టోపీతో చరణ్ ను మీడియా ముందుకు రాజమౌళి తీసుకు వచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. అదేవిదంగా జూనియర్ హెయిర్  స్టైల్ విషయంలో కూడ పూర్తి క్లారిటీ రాకుండా జూనియర్ కు కూడ రాజమౌళి టోపీ పెట్టాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఏమైనా రాజమౌళి తెలివితేటలకు అడుఅడుగునా నానితి ‘ఆర్ ఆర్ ఆర్’ మీడియా మీట్ లో కనిపించాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: