#RRR సినిమా 400 కోట్ల తో రూపొందిస్తున్నామని దానయ్య చెప్పాడు. అయితే అన్ని కోట్లు ఖర్చు చేయడానికి ఈ సినిమాలో ఏముందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కథ ప్రకారం అంత ఖర్చు చేయాలనుకోవడంలో ప్రాబిబిలిటీ ఎంత? అన్నది విశ్లేషిస్తే.. ఈ సినిమా కథలో వార్ బ్యాక్ డ్రాప్ కి ఉన్న ఆస్కారం ఏమీ కనిపించడం లేదు. బాహుబలి తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాలకు భారీ క్లైమాక్స్ కు ఆస్కారం ఉందా? అంటే అదేదీ కనిపించనే లేదు.

కొమురం భీం చరిత్రలో భీకర పోరాటాలు .. ఎన్టీఆర్ ఇక రెచ్చిపోతాడు ..!

ఇటు తెలంగాణ వీరుడు కొమురం భీమ్.. అటు ఆంధ్రా వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ ఇద్దరూ ఆంగ్లేయులపై ఎలాంటి పోరాటం సాగించారు? అన్నది తెరపై చూపించడం లేదు. అంటే ఆంగ్లేయులకు ఎదురెళ్లి దెబ్బ తీసే వ్యవహారాలు కానీ యుద్ధానికి ఆస్కారం ఉన్న సంగతుల్ని కానీ తెరపై చూపరు. ఆ ఇద్దరూ వీరులు అవ్వక ముందు ఏం చేశారు?  వీరులు ఎలా అయ్యారు? అన్నది మాత్రమే చూపిస్తారు. 


ఏదో మీడియా అడిగింది కదా అని దానయ్య బడ్జెట్ గురించి ఓ మాట విసిరేసారా?  లేక ఆ కథలో అంత డెప్త్ ఉందా? అన్నది ఆలోచించాలి. ఇక ఈ సినిమా కథలో కొమురం భీమ్ కానీ అల్లూరి సీతారామరాజు కానీ వెపన్స్ ఏం వాడారు? అంటే భారీ వెపన్స్ ఏవీ వాడలేదు. కేవలం బాణాలు మాత్రమే సంధించేవారని చరిత్ర చెబుతోంది. ఆంగ్లేయులపై అల్లూరి నైజాంపై కొమరం భీమ్ పోరాడారు కానీ వీళ్లు ఎదురు తిరిగి క్రూరత్వం చూపించేందుకు భారీగా ఆయుధాలు వాడలేదు. ఇక ఫిక్షన్ కథాంశాన్ని జోడించి చూపిస్తున్నామని.. ఆ ఇద్దరు వీరుల కథలో ఫిక్షన్ కీలక భూమిక పోషిస్తుందని జక్కన్న చెప్పారు కాబట్టి ఆ ఫిక్షన్ లో ఏం ఉంది? అన్న డైలెమా కొనసాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: