ఆర్.ఆర్.ఆర్ ఎనౌన్స్ మెంట్ నాటి నుండి సినిమా కథ ఇదే అంటూ రోజుకో అప్డేట్ ప్రేక్షకులను విసిగిస్తుంది. పిరియాడికల్ మూవీ అని తెలుస్తున్నా ఆర్.ఆర్.ఆర్ సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశారు. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి అండ్ టీం సినిమా కథ చెప్పారు.


అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరు ఫ్రీడం ఫైటర్స్ గా మారకముందు వారు ఎలా ఉన్నారు అని చెప్పే కథతో ఆర్.ఆర్.ఆర్ వస్తుందట. రియల్ హీరోల్స్ ఇద్దరి పాత్రల్లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా రాజమౌళికి ఓ వింత ప్రశ్న ఎదురైంది. బాహుబలి తర్వాత వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ లేకుండా సినిమా చేస్తానని చెప్పారుగా మరి ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ వాడరా అంటే ఈ సినిమాలో కూడా వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ బాగానే ఉంటాయని అన్నారు.


అయితే కుక్కతోక వంకర అన్నట్టుగా సినిమాకు ఏది కావాలో అది ఇచ్చేందుకు తాను మాట మీద నిలబడనని చూచాయగ చెప్పాడు రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ రాజమౌళి నుండి వస్తున్న మరో భారీ స్కేల్ ఉన్న సినిమా. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా అజయ్ దేవగన్, అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు.


ఎప్పుడూ లేనిది రాజమౌళి సినిమా మొదటి ప్రెస్ట్ మీట్ లోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. అయితే అనుకున్న డేట్ కు రావాలంటే ఈ ఇయర్ డిసెంబర్, జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఒక 5 నెలలు వి.ఎఫ్.ఎక్స్ ఎఫెట్స్ పడుతుందని అన్నారు. మొత్తానికి జక్కన్న బాహుబలి తర్వాత దాన్ని మించే సినిమా తీస్తున్నారని ప్రేక్షకులు సంబరపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: