ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. తారక్ కొమరం భీం రోల్ చేస్తున్నారట. కాంబినేషన్ మాత్రమే కాదు అదిరిపోయే కథను రెడీ చేసుకున్న రాజమౌళి మరోసారి బాక్సాఫీస్ పై యుద్ధానికి సిద్ధం అయ్యాడని తెలుస్తుంది. అయితే అల్లూరి సీతారామరాజు అనగానే సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తుకొస్తారు.


ఆరోజుల్లో ఆ సినిమా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు కృష్ణ. అయితే ఆ తర్వాత ఆ పాత్రని మహేష్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. తీరా రాజమౌళి అల్లూరిగా రాం చరణ్ ను సెలెక్ట్ చేశాడు. అసలు ఈ ప్రాజెక్ట్ లో సీతారామరాజుగా రాజమౌళి ఎందుకు మహేష్ ను తీసుకోలేదు అంటే.. ఓ షోలో తాను మహేష్ తో తీసే సినిమా ఎలా ఉండాలని అనుకుంటున్నారని అంటే సీతరామరాజు కన్నా జేమ్స్ బాండ్ సినిమాకే ఎక్కువమంది కేకలేశారు.


అందుకే మహేష్ ను రామరాజు పాత్రకు తీసుకోలేదని అన్నారు రాజమౌళి. కృష్ణ గారు చేసింది ఫ్రీడం ఫైటర్ గా మరిన రామరాజు పాత్ర కాని తాను చెప్పే కథ అంతకుముందుది అది ఎవరికి తెలియదని అంటున్నాడు మన జక్కన్న. అయితే కొందరు మాత్రం రాం చరణ్ గా మహేష్ ను ఎలాగైనా ఒప్పించి తీస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   


ఆర్.ఆర్.ఆర్ ఇదే టైటిల్ తో అన్నిభాషల్లో రిలీజ్ అవుతుంది. అయితే దాని అబ్రివేషన్ మాత్ర ఒక్కో భాషలో ఒక్కోలా ఉంటుందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నట్టు రాజమౌళి వెళ్లడించారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: