నందమూరి తారక రామారావు, కొణిదెల రామ్ చరణ్ తేజ క‌థానాయ‌కులు గా నిర్మిస్తున్న సినిమా - టైటిల్ ను ' ఆర్ ఆర్ ఆర్’ గా నే ఉంచుతామ‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. ఈ సినిమాను 2020 జూలై 30న విడుదల చేస్తార‌ట‌. భార‌త చ‌రిత్రలో  భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో ముందు వరసలో ఉండే వాటిల్లో ఇదొక‌టి. ఈ సినిమా బ‌డ్జెట్‌ ₹350-400 కోట్లని సమాచారం. 

Image result for ram charan alia bhatt

1897లో పుట్టిన అల్లూరి సీతా రామరాజు కొన్నేళ్ళు దేశాటనకు వెళ్లారు. ఆ తరువాత బాగ చదువుకొని వచ్చి, స్వతంత్రం కోసం స్వంతంగానే పోరాడారు. అలాంటి యువ తరంగం సీతా రామరాజు పాత్రలో  రామ్ చరణ్ నటిస్తున్నారు- అతనికి జంట "సీత" గా అలియా భట్ నటిస్తోంది. 
Image result for ram charan alia bhatt
సీతారామరాజు జననం తరవాత నాలుగేళ్లకు అంటే 1901లో ఉత్తర తెలంగాణాలో కొమరం భీమ్  జన్మించారు. అతను కూడా కొన్నేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లి, విద్యావంతుడై తిరిగివచ్చి నాటి ముస్లిం అసఫ్జాహి రాజవంశస్తులైన నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడారు. అలాంటి యువ కెరటం కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. అతనికి జంటగా హాలీవుడ్ సంచలనం "డైసీ ఎడ్గర్ జోన్స్" మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్‌ నటించనుంది.  

ఇది కాల్పనిక కథ (ఫిక్షన్ స్టోరీ) 1920 లో నార్త్ ఇండియాలో జరిగే కథ ఇది. అజయ్ దేవగన్, ఒక బృహత్తరమైన ఐతిహాసిక పాత్రలో అదీ ఫ్లాష్బ్యాక్ లో నటిస్తున్నారు. సముద్ర ఖని, ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించబోతున్నారు. రెండు భిన్న ప్రాంతాలకు చెందిన ప్రజాకంటక పాలకులకు సమకాలీనులైన దేశోధారకులు కలసి పని చేసి ఉంటే....అనే కాల్పనిక కథను వెండితెరపైకి రాజమౌళి దర్శకత్వంలో తెచ్చి చూపిస్తే ఆ మనోహర దృశ్యకావ్యం ఎలా వుంటుందో? అదే ఆర్ ఆర్ ఆర్ చిత్రం

Image result for ram charan alia bhatt

“నేను ఇంకా ఇది నిజమా? కాల్పనికమా? కాదా? అని అనిపిస్తుంది. ఎప్పటి నుండో రాజమౌళి తో పనిచేయాలని ఉంది. అయితే నాకు బాగా నచ్చే ఎన్టీఆర్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లాను. వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. అదేంటి ఈయన ఉన్నారు ఏంటి అనుకున్నాను. ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. కొంచెం సేపయ్యాక మా ఇద్దర్నీ లోపలికి తీసుకు వెళ్లి రాజ‌మౌళి ఈ కథను చెప్పారు. ఖచ్చితంగా మీతో సినిమా చేస్తున్నాం అని ఆయనతో చెప్పాం. ఆ ఆనందంలో తీసిన ఫొటోనే అప్పట్లో మీతో షేర్ చేసుకున్నాం” ఈ సందర్భంగా అన్నారు రామ్‌చ‌ర‌ణ్‌

Image result for rajamauli RRR
“నేను ప్రెస్ మీట్ అంటే చాలా కాన్ఫిడెంట్‌ గా ఉంటాను. కాని ఈసారి ఎందుకో కాస్త టెన్షన్‌గా ఉంది. ఏదో తాదాత్మ్యత. చిత్ర శిల్పి జక్కన్నతో నాకిది నాలుగో చిత్రం. వాట‌న్నింటి కంటే ఇది చాలా ప్రత్యేకంగా మిగిలిపోతుంది. రామ్‌ చరణ్ తో నాకు ముందునుంచి స్నేహం ఉంది. అదిలా సినిమాలో కూడా క‌లిసి సాగు తుంద‌ని అనుకోలేదు. దిష్టి తగిలే స్థాయిలో మా బంధం బలపడింది” ఈ సందర్భంగా అన్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: