‘అర్జున్ రెడ్డి’  మ్యానియాతో విజయ్ దేవరకొండ యూత్ కు ఐకాన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే కన్నడ టాప్ హీరో దర్శకుడు ఉపేంద్ర చాల సంవత్సరాల క్రితం చిరంజీవి మెగా స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రోజులలో చిరంజీవి తో ‘అర్జున్ రెడ్డి’ స్థాయిలో ఒక సంచలన కథతో సినిమా తీయాలని ప్రయత్నించిన విషయం  ఇప్పుడు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఆసక్తి కరమైన ఈ న్యూస్ వివరాలోకి వెళ్ళితే ఒక  కన్నడ సినీపరిశ్రమలో బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా వచ్చి పెద్ద హీరోగా ఎదిగిన వ్యక్తి ఉపేంద్ర. నటుడిగా దర్శకుడిగా ఒక రేంజ్ లో ఉపేంద్ర ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో 1990 ప్రాంతలలో ఉపేంద్ర చిరంజీవితో ఒక సినిమాను చేయడానికి ప్రయత్నాలు చేసాడట. 
Chiranjeevi,Khaidi No 150 movie Interview,Khaidi No 150,Khaidi No 150 press meet,Khaidi No 150 press meet pics,Khaidi No 150 press meet images,Khaidi No 150 press meet photos,Khaidi No 150 press meet stills,Khaidi No 150 press meet pictures
ఆరోజులలో చిరంజీవి ఉపేంద్రకు ఉన్న క్రేజ్ ను గమనించి అతడి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి కనపరిచాడట. ఈమూవీని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఆరోజులలో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఉపేంద్ర తన టీమ్ తో చెప్పి ఒక పవర్ ఫుల్ కథ చెప్పడం ఆపాత్రకు చిరంజీవి ఒకే చేయడం జరిగిపోయిందని ఈవిషయాలు తెలిసిన నిర్మాత దర్శకుడు వైవీఎస్ చౌదరి ఈమధ్య ఒక ఫిలిం ఫంక్షన్ లో చెప్పాడు. ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘ఐ లవ్ యూ’ తెలుగులో కూడ డబ్ చేస్తున్న నేపధ్యంలో ఆ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ కుచౌదరి అతిధిగా వచ్చి అప్పటి విషయాలు ఇప్పుడు బయటపెట్టాడు. 
Chiranjeevi,Khaidi No 150 movie Interview,Khaidi No 150,Khaidi No 150 press meet,Khaidi No 150 press meet pics,Khaidi No 150 press meet images,Khaidi No 150 press meet photos,Khaidi No 150 press meet stills,Khaidi No 150 press meet pictures
అప్పట్లో తాను ఉపేంద్ర వద్ద సహాయ దర్శకుడుగా పనిచేస్తున్న రోజులలో ఈ సంఘటన జరిగిందని వాస్తవానికి ఆకథ ‘అర్జున్ రెడ్డి’ కన్నా పవర్ ఫుల్ స్టోరీ కావడమే కాకుండా ఒక ట్రెండ్ ను క్రియేట్ చేయగల కథ అని అంటున్నాడు చౌదరి. అయితే ఆతరువాత కొన్ని అనుకోని సమస్యల వల్ల ఉపేంద్ర చిరంజీవితో తీయవలసిన ఆమూవీ ఆగిపోయిందని అయితే ఆసినిమా అప్పట్లో వచ్చి ఉంటే అది ‘అర్జున్ రెడ్డి’ కన్నా గొప్ప సంచలనం సృష్టించగల కథ అని అంటున్నాడు చౌదరి.



మరింత సమాచారం తెలుసుకోండి: