నిన్న జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ దానయ్య తనకు ఒక ప్రముఖ నిర్మాత ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ వదులుకుంటే 100 కోట్లు ఆఫర్ చేసాడు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడంతో ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో ఆనిర్మాత ఎవరు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి  ప్రశ్నలు ఒక నిర్మాతకు ఎదురైనప్పుడు నవ్వి ఊరుకోవడం కానీ అలాంటి వార్తలలో నిజం లేదు అంటూ ఆ వార్తలను గాసిప్పులుగా తీసి పారవేస్తూ ఉంటారు. 
రాంచరణ్, ఎన్టీఆర్ ఒప్పుకోకపోతే
అయితే దీనికి భిన్నంగా దానయ్య రాజమౌళితో ఎప్పటి నుంచో సినిమా చేయడాన్ని కలగా భావిస్తున్నానని తాను ఇలాంటి అరుదైన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను అంటూ పబ్లిక్ గా చెప్పడం వెనుక మరో వ్యూహం ఉంది అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి అత్యంత భారీ లాభాలు రాబోతున్నాయని సంకేతాలు ఇవ్వడానికే దానయ్య చేత రాజమౌళి ఇలా మాట్లాడించి ఉంటాడు అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. 
 నాపై ఎలాంటి ఒత్తిడి లేదు
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ద్వారా రాజమౌళికి వచ్చే పారితోషికం కంటే ఈమూవీ బిజినెస్ లో ఎక్కువ షేర్ వస్తుంది అని అంటున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈమూవీ పై 400 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నామని దానయ్య చేత లీకులు ఇప్పించడం బట్టి ఈమూవీ బిజినెస్ ను రాజమౌళి సుమారు 800 కోట్ల మేరకు చేయబోతున్నాడా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి. 
RRR Photos
అయితే అలాంటి రేంజ్ లో బిజినెస్ జరిగితే ‘ఆర్ ఆర్ ఆర్’ కు వెయ్యకోట్ల పైన కలక్షన్స్ రావలసి ఉంటుంది. అన్ని సినిమాలు ‘బాహుబలి’ రేంజ్ లో హిట్ అవ్వడం జరగని పని మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ ల సినిమాలు కూడ ఈమధ్య కలక్షన్స్ విషయంలో చతికలు పడుతున్న నేపధ్యంలో దానయ్య అంచనాలు వాస్తవ రూపంలో లేవు అన్న కామెంట్స్ వస్తున్నాయి..     



మరింత సమాచారం తెలుసుకోండి: