సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిర్మించిన విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రోజులుగా ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్నారు వర్మ.  ఫోటోలు, టీజర్, లిరికల్ సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.  అయితే ఈ చిత్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నా రంటూ ఆరోపణులు కూడా చేశారు రాంగోపాల్ వర్మ.  ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న తేదీకి ఖచ్చితంగా విడుదల చేస్తానని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాడు. ఇక టీజర్, లిరికల్ సాంగ్స్ తో చిత్రంపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. 
Image result for laxmi ntr movie
తాజాగా ఈ చిత్రంలో  వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ కి సంబంధించి ఆరు నిమిషాల నిడివి గల వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.  ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతితో కలిసి వైశ్రాయ్ హోటల్ వద్దకు చైతన్య రథం మీద తన అనుచరులను వెంటేసుకొని వస్తారు.కానీ కొంత మంది ప్రైవేట్ గార్డులు ఇందులోకి అనుమతి లేదని చెప్పడం..ఎన్టీఆర్ గొంతు చించుకొని  తన పార్టీ అభ్యర్థులను  అభ్యర్ధించడం చూపిస్తున్నారు. 

అయితే చంద్రబాబుని పోలిన పాత్ర లోపల ఎవరితోనో చెవిలో ఏదో చెప్పడం.. వెంటనే ఎన్టీఆర్ మీద చెప్పుల వర్షం కురవడం ఇదంతా క్లియర్ గా చూపించారు. ఆ వెంటనే బ్యాక్ గ్రౌండ్ లో 'దగా దగా' అనే పాట మొదలవుతుంది.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: