రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ పై రోజు రోజుకూ ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది.  ఎప్పుడైతే డైసీని హీరోయిన్ గా తీసుకున్నారో... ఆ మరుక్షణం నుంచే డైసీ ఎవరు.. ఏంటి అనే విషయాల గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.  బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుండటం, రామ్ చరణ్- ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతుండటంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ తీసుకోవడం పట్ల రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి.


చాాలా మంది నెటిజన్లు అసలు ఎవరీ హాలీవుడ్ భామ అని నెట్టింట్లో వెతుకుతున్నారు.  డైసీ ఎడ్గర్ జోన్స్.. హాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోల ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా ‘కోల్డ్ ఫీట్’ టీవీ షోలో జోన్స్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  1997లో మోస్ట్ పాపులర్ అయిన ఈ టీవీ షోకు ఎడ్గర్ జోన్స్ అదనపు ఆకర్షణ తెచ్చింది. 2017లో ఎడ్గర్ జోన్స్ ఎంట్రీతో ‘కోల్డ్ ఫీట్’ టీవీ షో రేటింగ్స్ అమాంతం పెరిగాయి.


 కోల్డ్ ఫీట్ లో డైసీ ఆకట్టుకుంది.  సహజసిద్ధంగా నటించి మెప్పించింది.  అలానే పాండ్ లైఫ్, వార్ ఆఫ్ ది వరల్డ్ టీవీ సీరీస్ లు ఆకట్టుకున్నాయి. కాకపోతే ఈ బ్యూటీకి అక్కడ సినీ చాన్సులు మాత్రం రాలేదు. టివి సీరీస్ ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందినప్పటికీ మంచి సినిమాల్లో మాత్రం అవకాశాలు రాలేదు.  రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో అవకాశం రావడంతో డైసీ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్‌లో డైసీని హీరోయిన్‌గా తీసుకోవడం ఏద ప్రత్యకత ఉందనుకుంటున్నారు ఆడియన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: