తెలుగు ఇండస్ట్రీలోకి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత తెలుగు హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.  ఇటీవల కాలంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకూల్ కి తెలుగు లో అవకాశాలు తగ్గాయి.  దాంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది.  అప్పుడప్పుడు వివాదాల్లో కూడా రకూల్ ఉంటుందన్న విషయం తెలిసిందే. 
Related image
ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న రీతిలో హైదరాబాద్ లో బిజినెస్ కూడా ప్రారంభించింది. ఈ మద్య మూవీస్ లో బాగా అవకాశాలు తగ్గడంతో రకూల్  ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల తెరపై కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సైజ్ జీరో కోసం విపరీతంగా శ్రమించింది. దీంతో సైజ్ జీరో మాటేమో కానీ మైనస్ జీరోకి వెళ్లిపోయింది.
Image result for rakul preet singh slim bikini
ప్రస్తుతం సింగపూర్ వెకేషన్‌లో ఉన్న రకుల్.. నలుపురంగు బికినీ ధరించి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.   సోషల్ మీడియాలో ఫోటోలు చూసి నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు. జిమ్ముల్లో తెగ కష్టపడి.. బాగా స్లిమ్ అయిపోయిన ఈ బ్యూటీని అభిమానులు అయ్యో రకూల్ కాస్త బొద్దుగా ఉంటేనే బాగుంటుందేమో అని అభిప్రాయ పడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: