రంగస్థలం హిట్ తో మంచి ఊపుమీదున్న రాం చరణ్ కు బోయపాటి లాంటి మాస్ అండ్ పవర్ ఫుల్ డైరక్టర్ దొరికితే ఎలా ఉంటుందో అని ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూశారు. స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ కు సరైనోడుతో స్ట్రాంగ్ మాస్ ఫాలోయింగ్ ఏర్పరచిన బోయపాటి శ్రీను రాం చరణ్ తో ఇంకే రేంజ్ సినిమా చేస్తాడో.. ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో అనుకున్నారు.


కాని అంచనాలను తలకిందులు చేస్తూ వినయ విధేయ రామ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏదో రాం చరణ్ ఫాలోయింగ్, సంక్రాంతి సెలవులు కారణం చేత 60 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయి తప్ప సినిమా మాములు సీజన్ లో రిలీజ్ చేస్తే ఘోరంగా ఉండేది. ఇక ఆ సినిమా ఫ్లాప్ అయినందుకు రాం చరణ్ ఓ పెటర్ రాశాడు.


ఇక లేటెస్ట్ గా పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ సినిమాపై విశ్లేషించారు. గ్యాంగ్ లీడర్ తరహాలో ఈ కథ సాగుతుందని. ఆ సినిమాలో చిరంజీవి పేరు కొణిదెల రాజారాం పాత్ర చేశాడు. ఇందులో రాం చరణ్ కొణిదెల రామ్ గా కనిపించాడని అన్నారు. అనాధలైన నలుగురికి రక్షకుడిగా మారడం మంచి పాయింట్ అయితే స్క్రీన్ ప్లే లో గందరగోళం వల్ల సినిమా మెప్పించలేదని అన్నారు.  


సెకండ్ హాఫ్ లో ఫైట్స్ కాస్త ఓవర్ డామినేట్ చేశాయని.. సినిమా బీహార్ లో కొద్దిసేపు, వైజాగ్ లో కొద్దిసేపు జరుగుతున్నట్టు అనిపించిందని. సస్పెన్స్, సెంటిమెంట్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తే బాగుండేదని అన్నారు. ప్రశాంత్ చనిపోయిన విషయం స్నేహకు చెప్పే విషయంపై కూడా ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. 


బోయపాటి శ్రీను మంచి దర్శకుడు విజయాలతో దూసుకెళ్తున్నాడు. అయితే ఆయన చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడ్డాయి. రాం చరణ్ ఆ సినిమా ఫెయిల్యూర్ నుండి బయటకు వచ్చి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ తో పాటుగా ఎన్.టి.ఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: