ఆర్జివి మొదలు పెట్టిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గురించి రోజుకో న్యూస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆర్జివి సినిమా ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా మొదలు పెట్టిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.. ఎన్.టి.ఆర్ జీవితానికి సంబందించి అసలు కథ ఇదే అంటున్నాడు వర్మ.


మార్చి 22న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకునేందుకు టిడిపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేయగా ఈసీ రజత్ కుమార్ సినిమాని అడ్డుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇదిలాఉంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నిర్మాత రాకేష్ ఆర్జివికి వచ్చిన 50 కోట్ల ఆఫర్ గురించి బయటపెట్టారు.


ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఆపేస్తే 50 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందట. ఈ ఆఫర్ ఎవరు ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టిడిపి వ్యతిరేకంగా సినిమా ఉంటుందని తెలిసి సినిమాను ఆదిలోనే ఆపేయాలని చూశారట. అయితే వర్మ వ్యక్తిత్వం డబ్బుతో కొనేది కాదని అందుకే 50 కోట్ల ఆఫర్ ను వర్మ కాదన్నాడని అన్నారు రాకేష్.


ఆర్జివి అప్పుల్లో ఉన్నాడు కాబట్టి ఫ్యాన్సీ ఆఫర్ వస్తే ఏదైనా చేసేస్తాడు అనుకునే వారికి రాకేష్ సమాధానం ఇచ్చారు. ఆర్జివి అప్పుల్లో లేరని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఆర్జివిని సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా చేశాయి. ఎన్.టి.ఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన టైం నుండి సినిమా మొదలవుతుంది. మరి ఊహించిన విధంగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే వచ్చే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: