అందరి అంచనాలకు మించే కథతో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ అది కూడా ఇద్దరు రియల్ హీరోస్ గా చేయడం ఆ స్టార్స్ అభిమానులకు ఈ సినిమా ముందే సంతోషాన్ని తెచ్చి పెట్టింది. ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాలను బయటపెట్టాడు రాజమౌళి.


ముఖ్యంగా సినిమా కథ ఏంటి ఎలాంటి అంచనాలతో సినిమాకు రావొచ్చు అన్నది పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. ఇదిలాఉంటే సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారని తెలిసిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరు రియల్ లైఫ్ లో కలుసుకోలేదు. అయితే ఆ ఇద్దరిని కలిపే పాత్రతో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందట.


సినిమాలో చివరి అర్ధగంట అజయ్ దేవగన్ స్క్రీన్ స్పేస్ ఉంటుందట. ఆ అర్ధగంట ఎపిసోడ్ మాత్రం నభూతో నభవిష్యత్ అనేలా భారీగా ఉంటుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ దశలోనే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండగా స్క్రీన్ పై ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బాహుబలి కాదు దానికి రెండు మూడింతలు ఎక్కువ ఉండేలా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. అందుకే బడ్జెట్ లిమిటేషన్స్ ఏమి లేకుండా చూస్తున్నారు.    


డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు డివివి దానయ్య వెళ్లడించారు. అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చూస్తుంటే మరోసారి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చాటిచెప్పేలా జక్కన్న పెద్ద స్కెచ్ వేశాడని అనిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: