బాలీవుడ్ నటి మందిరా బేడీ గురించి తెలిసిందే. అందానికి అడ్రస్ గా ఉంటుంది. ఆ అమ్మడు తెలుగులో కూడా  మూవీస్  చేస్తోంది.  అందులో ఓ  మూవీ ఎవరిదో కాదు.  పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్‌పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ సినిమాకు  పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 


ప్రస్తుతం గోవాలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇదిలాఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. బాలీవుడ్ నటి మందిరాబేడి సినిమాలో కీలకపాత్ర చేస్తోందట. రీసెంట్‌గా ‘రొమాంటిక్’ టీమ్‌తో గోవాలో జాయినైందని టాక్. మందిర నెగెటివ్ షేడ్స్ పాత్ర చేస్తుందని సమాచారం. టీవీ సీరియల్ నటిగా పాపులారిటీ తెచ్చుకున్న మందిర బాలీవుడ్ సినిమాల్లో నటించడంతోపాటుగా టీవీ హోస్టుగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రభాస్ తాజాచిత్రం ‘సాహో’లోనూ నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.


మరి ఈ మూవీలో మందిరా బేడీ రోమాంటి అంటే ఎలా ఉండాలో చెప్పేస్తోంది. కుర్ర కారుకి కిర్రాకు తెప్పించే సత్తా  తనకు ఉందని చాటి చెబుతోంది కూడా. మరి ఈ మూవీలో హీరో, కధ పక్కన పెడితే మందిరబేడీ కోసమైనా సినిమాకు వచ్చే ఫ్యాన్స్ వేరేగా ఉంటారన్నది ష్యూర్. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: