టాలీవుడ్ లో ఆ మద్య కృష్టవంశి దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’సినిమాలో ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా అంటూ డైలాగ్ కొడుతూ..సినిమాలో ఛాన్స్ కోసం తప్పు చేసే క్యారెక్టర్ లో నటించిన నటి సంగీత గుర్తుంది కదా..వివాహం తర్వాత సినీ పరిశ్రమకు దూరం అయ్యింది.  సినీ నేపథ్యం నుంచి వచ్చిన సంగీత తాత  కె.ఆర్.బాలన్ ఒక సినిమా నిర్మాత. ఆయన 20కి పైగా తమిళ సినిమాలను నిర్మించారు.
Related image
ఆమె తండ్రి అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. పాఠశాలలో చదివేటప్పుడే భరతనాట్యాన్ని అభ్యసించారు.  చాలా కాలం తర్వాత సంగీత రీ ఎంట్రీ ఇస్తుంది.  ప్రస్తుతం ఆమె వయసు నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న వేళ  ఆమె 'తమిళ రసన్' అనే తమిళ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది.  విజయ్ ఆంటోని,రమ్య నంబిసన్ నాయకా నాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సంగీత ఒక కీలకమైన పాత్రను చేస్తోంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి సంగీత మాట్లాడుతూ..వివాహం తర్వాత నాకు ఎన్నో సినిమా ఛాన్సులు వచ్చాయి..కానీ పెద్దగా నచ్చక పోవడంతో వాటిని రిజక్ట్ చేయాల్సి వచ్చిందని అన్నారు. చాలా కాలం తర్వాత   'తమిళ రసన్' కథ నచ్చింది..అందులో తన పాత్ర ఎంతో కీలకమైనది..అందుకే నటిస్తున్నానని అన్నారు.  ఇక బిచ్చగాడు సినిమాతో తెలుగు లో మంచి క్రేజ్ సంపాదించాడు విజయ్ ఆంటోని. 


మరింత సమాచారం తెలుసుకోండి: