టాలీవుడ్ లో కొంత మంది కాంబినేషన్ ఎన్ని సార్లు వచ్చినా ఆ సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తాయి.  ఈ వరుసలో వచ్చేవారు రాజమౌళి - ఎన్టీఆర్, త్రివిక్రమ్ - అల్లు అర్జున్.  వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇప్పటి వరకు సక్సెస్ పొందినవే.  ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా నాల్గవది. 
Image result for trivikram srinivas banny
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు  'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా తరహాలోనే ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో నడుస్తుందట. కాకపోతే ఈ సినిమాలో బన్ని తండ్రిగా ప్రకాశ్ రాజ్ రోల్ కొద్ది సేపే ఉంటుంది.
Related image
కానీ ఈ సినిమాలో తండ్రి పాత్ర ఎండ్ అయ్యే వరకు ఉంటుందని సమాచారం.  ఈ  సినిమాకి 'నాన్న .. నేను' అనే టైటిల్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని త్రివిక్రమ్ వ్యక్తం చేసినట్టుగా టాలీవుడ్ వర్గాల టాక్. ఒక వేళ ఇదే టైటిల్ ఖరారైతే..గతంలో వచ్చిన తండ్రి సెంటిమెంట్ బాగా వర్క్ ఔట్ అవుతుందని భావిస్తున్నారు. 

గతంలో సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో..మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక బన్నీ సరసన పూజా హెగ్డే, కేథరిన్ ల పేర్లు వినిపిస్తున్నాయి.  అల్లు అర్జున్  పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: