తెలుగు తెరపై ప్రయోగాలు చేయడంలో ముందుడే నటుడు నాని.. చేసింది తక్కువ సినమాలైనా డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటాడన్న పేరుంది. ఈ నేచురల్ స్టార్ ఇప్పుడు ఏకంగా విలన్ రోల్ చేస్తున్నాడంట. 

సంబంధిత చిత్రం


ఏదో గెస్ట్ రోల్ అనుకోకండి.. ఫుల్ లెంగ్త్‌ విలన్ రోల్ కు నాని ఓకె చెప్పేశాడట. ఈ సినిమా దర్శకుడు ఎవరో తెలుసా.. ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇంద్రగంటి ఇప్పటికే నానితో జెంటిల్ మేన్ అనే సినిమా తీశాడు. గొప్పగా ఆడకపోయినా నానికి మంచి నటుడిగా పేరు తెచ్చిందా సినిమా. 
సంబంధిత చిత్రం

ఇప్పుడు అదే దర్శకుడి చిత్రంలో నాని ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ కు ఓకే చెప్పేశాడట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారు. ఇంతకీ హీరో ఎవరంటారా.. సుధీర్ బాబు. ఈయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. నానికి జోడీగా అదితీరావు నటిస్తారు. 

hero sudheer babu కోసం చిత్ర ఫలితం
ఇక సుధీర్ బాబు సరసన హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. 118 సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న నివేదా థామస్ ను మాట్లాడుతున్నారట. కానీ పారితోషకం విషయంలో కుదరటం లేదని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి క్రేజీ కాంబినషన్‌తో వస్తున్న ఈ సినిమా ఆరంభంలోనే ఆసక్తి రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: