ఇన్నాళ్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఏం జరుగుతుంది అన్నది ఎవరికి తెలిసేది కాదు కాని ఈమధ్య ప్రెస్ మీట్ పెట్టి మరి మా గొడవలను ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నారు. 'మా' మాజీ అధ్యక్షుడు శివాజి రాజా ఈసారి కూడా తాను అధ్యక్షుడిగా ఉండాలని పోటీలో నిలబడ్డారు కాని సీనియర్ నరేష్ 'మా' అధ్యక్షుడిగా గెలిచాడు.


10వ తారీఖు జరిగిన ఈ ఎలక్షన్స్ అదేరోజు ఫలితాలను వెళ్లడించారు. అయితే కొత్త అధ్యక్షుడు వెంటనే ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది కాని శివాజి రాజా తన పదికాలం మార్చి 31 వరకు ఉంది. అప్పటివరకు మా అధ్యక్షుడి కుర్చి నాదే అంటూ మెలిక పెట్టేశాడట. కాదు కూడదు అంటే కోర్టుకైనా వెళ్తా అని అన్నాడట శివాజి రాజా. ఇదే విషయాన్ని శనివారం ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా ముందు ఉంచాడు నరేష్. 


మేమేదో మంచి పనులు చేద్దామని అనుకుంటున్నాం కాని అడ్డుపడుతున్నారు. ఈ నెల 22న బాగుందని ఆరోజు మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేద్దామని అనుకున్నాం కాని అందుకు శివాజి రాజా అడ్డు పడుతున్నాడని నరేష్ అంటున్నారు. ఆ సీట్ లో ఏముందో అర్ధంకావట్లేదు. ఈ విషయాన్ని పెద్దల దృష్టి తీసుకెళ్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.


శివాజి రాజా వర్సెస్ నరేష్ గొడవ పక్కన పెడితే అనవసరంగా మా పరువుని బజారుకీడుస్తున్నారంటూ కొందరు వాదిస్తున్నారు. అయితే నిన్న ప్రెస్ మీట్ లో ఆర్టిస్టుల ఎల్.ఐ.సికి సంబందించిన అంశాన్ని లేవనెత్తాడు నరేష్.. నిజంగానే ఆ విషయం చాలా సెన్సిటివ్.. మరి శివాజి రాజా ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నది అర్ధంకావట్లేదు. వీటి వల్ల 'మా' మీద ఉన్న నమ్మకం కూడా పోయేలా ఉందని కొందరి అభిప్రాయం.  



మరింత సమాచారం తెలుసుకోండి: