మా ఎన్నికలు ముగిసినా ఇంకా వివాదాలు చల్లారడం లేదు. మార్చి 10న మా అసోసియేషన్ ఎన్నికలో నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నరేష్ ప్యానల్ లో పోటీ చేసిన జీవిత, రాజశేఖర్ కూడా విజయం సాధించారు.

సంబంధిత చిత్రం


గెలిచిన ఆనందంలో ఉన్న నరేశ్ టీమ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది. మా కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజా, అతడి ప్యానల్ సభ్యులు భాద్యతలు స్వీకరించేందుకు నిర్ణయించుకున్నారు. ఐతే.. ఆశ్చర్యంగా ఇందుకు శివాజీ రాజా అడ్డుపడుతున్నారు. 

సంబంధిత చిత్రం

టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపుతూ.. ఈనెల 31 వరకూ తనకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కాబట్టి తాను పూర్తి టర్మ్ పదవిలో ఉండే హక్కు ఉందని విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. వాస్తవానికి అది నిజమే అయినా.. ఒకసారి ఓడిపోయాక పదవి నుంచి దిగిపోవడానికి ఎప్పుడైనా రెడీగా ఉండాలి.

సంబంధిత చిత్రం

కానీ శివాజీ రాజా మాత్రం అవసరమైతే కోర్టుకైనా వెళతానని పంతం పట్టుకున్నారు. శివాజీ రాజా ప్రవర్తనతో నరేశ్ టీమ్ ఆందోళనలో పడింది. నేను చట్టబద్ధంగా ఎన్నికలో విజయం సాధించా. ఎప్పుడైనా భాద్యతలు స్వీకరించే అవకాశం ఉందంటున్నారు నరేశ్. ఆయన వాదన కూడా నిజమే. మరి ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: