మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లంటే సాధారణ జనాల్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో  పేరున్న తారల్లో కూడా అభిమానులు ఉన్న హీరోలు. అయితే ఒకరి అభిమాని మరొకరిని పంచన చేరడం అరుదు. కాని తాజాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఓ సూపర్ హీరో మహేష్ బాబు ను కూడా వదలకపోవడం చర్చనీయాంశం అయింది.

గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో మళ్లీ వెలుగువెలిగిన హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కు పిచ్చి అభిమాని, తన సినిమాల్లో పవన్ ను వాడుకోకుండా అసలే ఉండడు, అంతే కాదు తన మితృడు డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డితో కలిసి పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా నిజాం రైట్స్ తనే తీసుకున్నాడు.

అయితే ఇప్పడు నితిని మహేష్ బాబు కూడా సూపర్ అంటూ ఆయన వెంట పడ్డాడు. త్వరలో రానున్న మహేష్ ‘వన్’ సినిమా నిజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా తీసుకుంటున్నాడు. అభిమానమో, లేక ఇక వ్యాపారిగా మారాలనుకుని ఆదృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడో తెలియదు కాని ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్టు కొడతాయని అనుకుంటున్నవే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: