బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  నటుడిగా మొదట్లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ తర్వాత ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ వచ్చారు.  ఆ మద్య క్రీడా నపథ్యంలో వచ్చిన దంగల్ చిత్రం ప్రపంచ స్థాయిలో సునామీ సృష్టించింది.  ఈ చిత్రంలో యువకుడిగా..నడి వయస్కుడిగా అమీర్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.  ఇటీవల భారీ తారాగణంతో అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ బాక్సాపీస్ వద్ద నిరాశపరిచిన విషయం తెలిసిందే. 
Image result for dangal movie
ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో అమీర్ చాలా నిరుత్సాహ పడ్డారు. ఈ చిత్రం తర్వాత హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ గా వస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నాడు అమీర్. తాను నటించే ప్రతి చిత్రంలో ఏదో ఒక వైవిద్యం చూపించే అమీర్ ఖాన్ నటనకు ఎపుడు గుడ్ బై చెప్తాడో స్వయంగా వెల్లడించాడు.  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..సినిమాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం వల్లే తారే జమీన్ పర్ చిత్రంతో దర్శకుడిగా  మారానని అన్నారు. 
Image result for amir khan new film forrest gump
ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించిన తనను ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆదరించారని..తాను  పూర్తిస్థాయి దర్శకుడిగా మారాక నటనకు గుడ్ బై చెప్పేస్తానన్నాడు. గతంలో  దంగల్ చిత్రం కోసం అమీర్ 20 కిలోలకుపైగా బరువు పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ కోసం ఏకంగా 20 కిలోలు తగ్గిపోయాడు..ఈ మిస్టర్ పర్ఫెక్ట్.


మరింత సమాచారం తెలుసుకోండి: