ఏ డైరెక్టర్ అయినా చెప్పిన బడ్జెట్ లో సినిమాను పూర్తి చేస్తే నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నట్టే. నిర్మాతకి ఒక దర్శకుడు హిట్‌ సినిమా తీసి పెట్టడం కంటే చెప్పిన బడ్జెట్‌లో, అనుకున్న టైమ్‌లో తీసి పెట్టడం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్‌. ఎందుకంటే బడ్జెట్‌లో, టైమ్‌కి తీసిన సినిమా హిట్టయితే నిర్మాతకి లాభాలు ఎక్కువ వుంటాయి. అదే బడ్జెట్‌ పెరిగిపోయి, తీయడానికి సమయం కూడా ఎక్కువ పడితే అప్పుడు లాభాల సంగతి అటుంచి, సినిమా హిట్టయినా కానీ పెట్టుబడి రాబట్టడం కష్టమవుతుంది.

వంశీ పైడిపల్లిపై ఈ ఫీడ్‌బ్యాక్‌ డేంజరే

దర్శకుడు వంశీ పైడిపల్లి భారీ బడ్జెట్‌ చిత్రాలు తీస్తుంటాడు కానీ ఇంతవరకు భారీ హిట్‌ ఏదీ ఇవ్వలేదు. బృందావనం, ఎవడు లాంటి హిట్‌ సినిమాలు అందించినా కానీ 'ఊపిరి'తో దర్శకుడిగా గౌరవం తెచ్చుకున్నాడు. అంతే కాదు మహేష్‌తో సినిమా తీసే అవకాశం కూడా దక్కించుకున్నాడు. అయితే బడ్జెట్‌ని కంట్రోల్‌లో వుంచలేకపోవడం ఇతని బలహీనత అనే టాక్‌ వుంది. మహేష్‌తో సినిమా అనే సరికి మరింత జాగ్రత్తగా సినిమా తీస్తూ చాలా ఎక్కువ టైమ్‌ తినేస్తున్నాడట.

Image result for maharshi

ఎస్టిమేట్‌ చేసిన బడ్జెట్‌ ఎప్పుడో దాటేయడంతో నిర్మాతలు చేసేదేమీ లేక సైలెంట్‌గా చూస్తున్నారట. ఊపిరి చిత్రం కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అయిందని అప్పట్లో పివిపి రభస చేసిన సంగతి తెలిసిందే. మహర్షి చిత్రానికి అతనూ ఓ నిర్మాతే కానీ ఈసారి భారం పంచుకోవడానికి మరో ఇద్దరు నిర్మాతలు వుండడంతో మహర్షి ఇన్‌సైడ్‌ వ్యవహారాలు మీడియాకి పొక్కడం లేదు. ఈ చిత్రానికి ఎంత బిజినెస్‌ జరిగినా కానీ నిర్మాతలకి పెద్దగా ఏమీ మిగిలేటట్టు లేదనేది ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దర్శకుడిగా తనపై ఇలాంటి ఫీడ్‌బ్యాక్‌ వినిపించడం వంశీ పైడిపల్లి ఫ్యూచర్‌కి ప్రమాదకరమే

మరింత సమాచారం తెలుసుకోండి: