అన్నగారి జీవిత చరమాంకాన్ని కధగా ఎంచుకుని వెన్నుపోట్ ఎపిసోడ్ ని హైలెట్ చేస్తూ సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు కోర్టు అడ్డంకులు కూడా లేకుండా పోయాయి. ఈ మూవీని హ్యాపీగా విడుదల చేసుకోవచ్చునంటూ కోర్టు  పేర్కొంది.


కాగా, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక  ఎన్నికలు పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదల వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు ఈ రోజు  కొట్టివేసింది. ఈ సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని సూర్యనారాయణ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారించిన కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లీయర్ అయ్యింది. 



ఇదిలా ఉండగా మొదట ఈ మూవీని ఈ నెల 22న విడుదల చేస్తానని మొదట చెప్పిన వర్మ ఇపుడు 29వ తేదీకి మార్చారు. దాంతో ఈ మూవీ విషయంలో తెర వెనక రాయబేరాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి వర్మ చెప్పిన మాట ప్రకారం సినిమాను ఏం చేస్తారో, ఎపుడు విడుదల చేస్తారో  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: