రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ కథ చెప్పి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు జక్కన్న.


ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో పాటుగా అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ మాత్రమే కాదు బాలీవుడ్ నుండి మరో ఇద్దరు టాప్ యాక్టర్స్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి.


ఇంతకీ ఆర్.ఆర్.ఆర్ లో నటించే ఆ స్టార్స్ ఎవరు అంటే సంజయ్ దత్, వరుణ్ ధావన్ అని తెలుస్తుంది. ప్రస్తుతం వారితో డిస్కషన్స్ చేస్తున్నారట. సినిమాలో వీరిద్దరికి మంచి రోల్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక అజయ్ దేవగన్ పాత్ర కూడా భగత్ సింగ్ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. 


ఎప్పుడు లేనిది రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసి మరి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందితో పాటుగా 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: