సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు మహేష్ తన మాటల ప్రస్థావనలో సీతా పాప గురించి చెబుతాడు చెప్పడం కన్నా అప్పుడప్పుడు తన ట్విట్టర్ లో సితార వీడియోలు పెడుతుంటాడు. అవి చూస్తే సితార అల్లరి ఏంటో తెలుస్తుంది. మహేష్ గారాలపట్టి సితార కొత్తగా క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది.


ఇక లేటెస్ట్ గా సితార డ్యాన్స్ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు మహేష్ బాబు. బాహుబలి కన్ క్లూజన్ లో కన్నా నిదురించరా సాంగ్ కు సితార స్టెప్పులేయడం.. ఆ వీడియో మహేష్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ వాటే టాలెంట్ సీతా పాప అని కామెంట్ పెట్టడం విశేషం. ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కాస్త టైం కేటాయిస్తాడు మహేష్.


అందుకే ఖాళీ టైం దొరికింది అంటే ఫారిన్ ట్రిప్పులేస్తాడు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మే 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న మహర్షి సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్నారు.


మహర్షి తర్వాత మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అవగా త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కూడా దిల్ రాజు నిర్మాణంలోనే ఉంటుందట. అయితే ఈ ప్రాజెక్ట్ కు అనీల్ సుంకర కూడా భాగస్వామ్యం అవుతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: