రెండు సీజన్లు ముగించుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు 3వ సీజన్ కు సన్నద్ధం అవుతుంది. అయితే మిగతా భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం బిగ్ బాస్ హోస్ట్ గా తెగ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా ఆ సీజన్ సక్సెస్ అయ్యింది. రెండో సీజన్ కు నాచురల్ స్టార్ నాని కూడా తన వరకు న్యాయం చేశాడు.


ఇక 3వ సీజన్ వచ్చేసింది.. ఈ సీజన్ కు హోస్ట్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. మొదట్లో ఈ సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తాడని చెప్పినా ఇప్పుడు అతను కాదంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే తారక్ బిగ్ బాస్ చేసే అవకాశం లేదని చెప్పాడట.


ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయనని చెప్పేసరికి ఇప్పుడు హోస్ట్ గా ఎవరిని తీసుకోవాలా అని కన్ ఫ్యూజన్ లో ఉన్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ సీజన్ హోస్ట్ గా చేస్తే 20 కోట్లు ఆఫర్ ఇస్తామని చెప్పినా సరే తారక్ తనకు డేట్స్ అడ్జెస్ట్ కావని చెప్పాడట. ఎవరినో ఒకల్ని తెచ్చి హోస్ట్ గా పెట్టడానికి ఇది మాములు రియాలిటీ షో కాదు.


బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ 12 సీజన్స్ కు హోస్ట్ గా చేస్తూ వస్తున్నాడు. అలాంటి హోస్ట్ తెలుగుకి దొరికితే బాగుంటుంది. హోస్ట్ గా తారక్ కాదు అంటే వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఎం.ఈ.కె లో అనుభవం ఉంది కాబట్టి కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా చేస్తాడని లేటెస్ట్ టాక్.  



మరింత సమాచారం తెలుసుకోండి: