సూపర్ స్టార్ మహేష్ బాబు నటనా కౌశలం మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే, తండ్రి కృష్ణ గారి నటవారసత్వంతో చిన్నప్పుడే బలనటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, ఆ వయసులోనే తన అద్భుత నటనా ప్రతిభతో తెలుగు ప్రేక్షసుకులను మెప్పించారు. ఇక హీరో అయ్యాక అది ఆయనను నటుడిగా మరిన్ని ఉన్నతశిఖరాలకు చేర్చి, ఇంతటి సూపర్ స్టార్డం తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.
Image result for mahesh babu family
ఇక ప్రస్తుతం చూస్తుంటే ఆయన బాటలోనే ఆయన తనయ సితార పయనిస్తున్నట్లు కొంత కనపడుతోంది. దానికి కారణం, సితార చిన్నవయసులోనే తండ్రి వలే మంచి చలాకీ గల అమ్మాయి అనడానికి ఇదివరకు ఆమెకు సంబందించి బయటపవచ్చిన వీడియోలను బట్టి చూస్తే అర్ధం అవుతుంది. ఇక నిన్న సితార, బాహుబలి సినిమాలోని కన్నా నిదురించరా అనే పల్లవితో సాగే పాటకు డాన్స్ చెసిన వీడియోని మహేష్, తన సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేశారు. ఇక ఇటీవల మన సంప్రదాయ నృత్యం భరతనాట్యంలో కొంత అభ్యాసన పొందిన సితార, వీడియోలోని పాటకు అందరిని ఆకట్టుకునే విధంగా డాన్స్ చేసిందనే చెప్పాలి. 

Image result for mahesh babu family

ఇక ఇటీవల మన సంప్రదాయ నృత్యం భరతనాట్యంలో కొంత అభ్యాసన పొందిన సితార, వీడియోలోని పాటకు అందరిని ఆకట్టుకునే విధంగా డాన్స్ చేసిందనే చెప్పాలి. ఇక మహేష్ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ,  నా సితార పాప ఎంత అద్భుతంగా డాన్స్ చేసిందో చూడండి అంటూ మురిసిపోతూ ఆ పోస్ట్ చేసారు. ఈ వీడియోని బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో సితార కూడా తండ్రి బాటలోనే నటనలో కూడా ప్రవేశించి తన ప్రతిభతో దూసుకుపోతుందేమో అనిపిస్తోంది అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: