విజయ్ దేవరకొండ సారీ చెప్పాడు.. ఔను.. అయితే అది తన కోసం కాదు.. తాను చేసిన తప్పు కోసం కాదు.. తన అభిమానుల కోసం.. ఇటీవల విజయ్ దేవరకొండ రౌడీ అంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే..అది ఆయన ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.

vijay devarakonda కోసం చిత్ర ఫలితం


అందుకే విజయ్ దేవరకొండ ఎక్కడ కనిపించినా రౌడీ రౌడీ అంటూ రచ్చ చేస్తున్నారు. ఆయన కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ ఈ విషయంలో శ్రుతి మించుతున్నారట. రౌడీ నినాదానికి బాగా ఎట్రాక్టయ్యారట. 

క్షమాపణలు చెప్పిన విజయ్ దేవరకొండ

చివరకు టూ వీలర్స్ నెంబర్ ప్లేట్లపై నెంబర్లు తీయించేసి రౌడీ అని రాసుకుని తిరుగుతున్నారట. ఈ విషయం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులను సున్నితంగా మందలించారు. 

నెంబర్ ప్లేట్

రూల్స్ అందరూ పాటించాలని అభిమానులకు సూచించాడు. అదే సమయంలో అలాంటి కుర్రాళ్ల తరపున తాను హైదరాబాద్ పోలీసులకు సారీ చెప్పాడు. మరి ఇకనైనా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ స్ఫూర్తిని అర్థం చేసుకుని..కాస్త బుద్దిగా ఉంటారా.. చూడాలి మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: