రెండు దశాబ్ధాల తర్వాత సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ గా మొదలు పెట్టిన ఇండియన్-2కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. శంకర్ డైర్క్షన్ లో కమల్ హాసన్ చేసిన ఇండియన్ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వల్ గా ఇండియన్-2 మొదలైనా సరిగా షూటింగ్ జరగట్లేదు.


కొన్నాళ్లు బడ్జెట్ విషయంలో శంకర్ తో లైకా ప్రొడక్షన్స్ గొడవతో షూటింగ్ ఆగిపోగా ఇప్పుడు కమల్ హాసన్ వల్ల సినిమా షూటింగ్ కు అంతరాయం కలుగుతుందట. కమల్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. అందుకే అటు పాలిటిక్స్ కు ఇటు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ చేసే అవకాశం కుదరట్లేదట.


ఇక మరో పక్క కమల్ వేసుకునే సేనాపతి మేకప్ వల్ల కూడా ఆయనకు స్కిన్ ఎలర్జీ వస్తుందని అందుకే సినిమా షూటింగ్ ఆగిందని తెలుస్తుంది. ప్రోస్థటిక్ మేకప్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయట. అందుకే షూటింగ్ కొద్దిరోజులు క్యాన్సిల్ చేశారట. కమల్ హాసన్ దశావతరాలు చేసినప్పుడు కూడా మేకప్ సమస్యలు రాలేదు.


ఇండియన్-2కి మాత్రం ఇబ్బంది అవుతుందట. ప్రస్తుతానికి షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది. అసలు మొదలవుతుందా లేదా అన్నది కూడా తెలియడం లేదట. చిత్రయూనిట్ మాత్రం సినిమా అతి త్వరలోనే మళ్లీ సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: