సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు.


మే నెలలో మహేష్ సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆ విధంగా మహర్షికి నెగటివ్ సెంటిమెంట్ కాగా.. దిల్ రాజు, అశ్వనిదత్ ల బ్యానర్ లో వచ్చిన సినిమాలన్ని మే నెలలో సూపర్ హిట్ అయ్యాయి. అందుకే సినిమా మీద దిల్ రాజు ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. ఇదిలాఉంటే మహర్షికి టైటిల్ కూడా ఓ సెంటిమెంట్ గా అనిపిస్తుంది.


సాధారణంగా ఆల్రెడీ తెలుగులో వచ్చిన సినిమా టైటిల్స్ వాడితే పాత సినిమాలు హిట్టైతే కొత్త సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. శంకరాభరణం, శత్రువు, గణేష్, మాయాబజార్ ఇలా సూపర్ హిట్ సినిమాలు మళ్లీ అదే టైటిల్ తో సినిమా చేయగా అవి ఫ్లాప్ అయ్యాయి. అయితే వంశీ తీసిన మహర్షి ఫీల్ గుడ్ మూవీ అయినా సినిమా హిట్ అవ్వలేదు.


ఇళయరాజా సాంగ్స్, అందులో నటించిన రాఘవకి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు కాబట్టి మహేష్ మహర్షి కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు సిని ప్రేమికులు. ఈ సినిమా చూసినా ప్రేక్షకులు సినిమా చూశాక అవును ఇది కరెక్టే కదా మనం ఎందుకు ఇలా చేయట్లేదు అన్న ఆలోచన వస్తుందని అన్నారు. సో మహర్షి సినిమాకు ఈ పాజిటివ్ వైబ్ సినిమాకు సూపర్ హిట్ చేస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: