తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నట వారసుడు అక్కినేని నాగ చైతన్య ఆయన సతీమణి సమంత పెళ్లైన తర్వాత మొదటి సారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. 
Image result for majili movie
తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "నువ్వు నిజంలాగా నను ముడేస్తుంటే ఈ నిమిషాన .. నేను గతంలోని ఆ కలల్లోనే వున్నా .., నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలా నను చూస్తున్నా .. నేను అదే పనిగా నిను వెలేస్తూనే వున్నా .." అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట వింటుంటే నిజంగా మనసుకు హత్తుకునేలా ఉంది.
Image result for majili movie
శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.  గోపీసుందర్ సంగీతం అందించిన ఈ పాట వనమాలి అందించిన సాహిత్యం అర్థవంతంగా..అందంగా వుంది. అరుణ్ గోపన్, చిన్మయి శ్రీపాద, బేబీ అనూష గానం మనసును తాకేలా వుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: