భారతీయ చలన చిత్ర రంగంలో బాహుబాషా నటుడిగా తనదైన ముద్ర వేశారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.  విలన్ గా కెరీర్ ప్రారంభించి కొన్ని చిత్రాల్లో హీరోగా నటించి..తర్వాత విభిన్నమైన పాత్రల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు ప్రకాశ్ రాజ్. ఒకప్పుడు గుమ్మడి తరహాలో పెద్ద వయసు పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు.  ఈ మద్య ప్రకాశ్ రాజ్ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా ప్రధాని మోదీని పలు సందర్భాల్లో తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు.  తాజాగా ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్న ప్రకాశ్ రాజ్ నామినేషన్ కు ముందే కర్ణాటక ఎన్నికల అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. 

మీడియా, భావ ప్రకటన స్వేచ్చ సంబంధించిన కార్యక్రమంలో ఆయన రాజకీయ ప్రసంగం చేశారని ఆరోపణలు వచ్చాయి. కాగా, ప్రకాశ్ రాజ్ చేసిన ప్రసంగాన్ని కొంత మంది రికార్డు చేసి దాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు షేర్ చేశారు. అధికారుల ఫిర్యాదుతో కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: