రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్. బాహుబలి తర్వాత ఆ అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా ఈ సినిమా వస్తుంది. ఈసారి రియల్ హీరోస్ తో జక్కన్న చేసే అద్భుతాన్ని చూసేందుకు అందరు సిద్ధం అవుతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ సెలెక్ట్ అయ్యారు.


ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎనౌన్స్ చేసిన టైం నుండి సినిమా మీద రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రీసెంట్ గా రాజమౌళి ప్రెస్ మీట్ లో ఆర్.ఆర్.ఆర్ కు వచ్చిన స్పందన బాగుంది అందుకే టైటిల్ అలానే ఉంచుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ అబ్రివేషన్ మాత్రం ఒక్కో భాషలో ఒక్కోలా ఉంటుందట. అయితే ఆర్.ఆర్.ఆర్ ఫ్యాన్స్ మాత్రం సినిమాకు అప్పుడే టైటిల్స్ పెట్టేస్తున్నారు.


ఆర్.ఆర్.ఆర్ టైటిల్స్ లో రామ రావణ రాజ్యం అని ప్రచారంలో ఉండగా.. మరికొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో కొన్ని చూస్తే రం రం రుథిరం.. రఘుపతి రాఘవ రాజారాం. రౌద్ర రణ రంగం.. ఇలా నెటిజెన్లు ఆర్.ఆర్.ఆర్ మీద రకరకాల టైటిల్స్ పెట్టేస్తున్నారు. వీటిలో రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ అన్ని భాషలకు సూట్ అవుతుందని భావిస్తున్నారు.


రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రస్తుతం పూణెలో మూడవ షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తాడని రాజమౌళి ఎనౌన్స్ చేయగా సంజయ్ దత్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ కూడా ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. 2020 జూలై 31న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: