నందమూరి బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ కు కొద్దిపాటి గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. ఏపిలో ఎలక్షన్స్ నడుస్తున్న ఈ టైంలో పూర్తిగా పార్టీ ప్రచారంలో తలమునకలైన బాలకృష్ణ తర్వాత చేయాల్సిన బాలకృష్ణ సినిమాను జూన్ లో మొదలు పెడతాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా బాలకృష్ణ ఓ తమిళ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట.   


కోలీవుడ్ లో సూపర్ హిట్టైన విక్రంవేద సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. తమిళ సినిమాలో విజయ్ సేతుపతి, మాధవన్ నటించడం జరిగింది. మాధవన్ పోలీస్ పాత్రలో నటించగా విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టార్ గా నటించాడు. సినిమాలో ఇద్దరు పోటీపడి మరి నటించి మెప్పించారు.


అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ లో బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమా చూసిన బాలకృష్ణ నెగటివ్ రోల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టు తెలుస్తుంది. ఆ పాత్రలో మరోసారి బాలయ్య తన నట విశ్వరూపం చూపించాలని చూస్తున్నాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో తండ్రి పాత్రలో మెప్పించినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.   


బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అవగా హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అవడంతో బాలకృష్ణ సినిమాతో సత్తా చాటాలై చూస్తున్నాడు బోయపాటి శ్రీను.



మరింత సమాచారం తెలుసుకోండి: