సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను చేసే ప్రతి సినిమా విషయంలో దాదాపుగా ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తీసుకుంటూ ఉంటారు. అదే విధంగా ప్రస్తుతం ఆయన దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ గారి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ తో ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి వివాహానంతరం జరిగిన ఘటనలకు సంబంధించిన అంశాన్ని తీసుకొని ఆయన ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Image result for laxmis ntr movie stills
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలు యూట్యూబ్ లో వీక్షకుల ఆదరణతో ముందుకు దూసుకు పోతున్నాయి. ఇక తన సినిమాలో ఎటువంటి కల్పితాలు ఉండవని, ఎన్టీఆర్ కు జరిగిన  అన్యాయం మరియు వెన్నుపోతుతో ఆయన నుండి అధికారాన్ని ఎలా లాక్కున్నారు, అలానే లక్ష్మీ పార్వతితో వివాహం తరువాత జరిగిన ఘటనలను తాను ఉన్నది ఉన్నట్లుగా చూపించబోతున్నాను అని చెప్పడంతో ఈ ఈ సినిమా చూడాలి అనే ఆసక్తి రోజు రోజుకి ప్రేక్షకుల్లో కూడా పెరుగుతోంది . 

Related image

ఇక ఈ నెల 29న ముందుకు రాబోతున్న ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదలను ఆపాలని జరుగుతున్న ప్రయత్నాలను ధైర్యంగా ఎదుర్కొని చివరకు అనుకున్న విధంగానే అదే రోజున సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు వర్మ. కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రధానంగా ఎన్టీఆర్ పదవిని మరియు ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కునేందుకు అప్పట్లో చంద్రబాబు వైస్రాయ్ హోటల్ వేదికగా చేసిన లాబీయింగ్ ని మరియు ఆ ఘటన తాలూకు సన్నివేశాలను సినిమాలో ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారట.

అంతేకాక ఈ సీన్లు సినిమాకు పెద్ద హైలెట్ కానున్నాయని, అలానే ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ, చంద్రబాబుల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయని సమాచారం. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త ప్రకారం వర్మ అనుకున్న విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ కనుక హిట్ అయితే వివాదాల విషయం పక్కన పెడితే దర్శకుడిగా ఆయనకు మరొక్కసారి పునర్వైభవం వచ్చినట్లు అని చెప్పుకోవచ్చు...


మరింత సమాచారం తెలుసుకోండి: