ల‌క్ష్మీస్ ఎన్టీఆర్... ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.. ఈ సినిమాలో చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎలా వెన్నుపోటు పొడిచారో చాలా క్లియర్ గా చూపించబోతున్నారు వర్మ. సరిగ్గా ఎన్నికల సమయం కావడంతో ఇది చంద్రబాబుకు డ్యామేజ్ చేస్తుందని టీడీపీ భయపడుతోంది. 

lakshmis ntr lakshmi parvathi కోసం చిత్ర ఫలితం


ఐతే.. ఈ సినిమా రూపొందించడంలో లక్ష్మీపార్వతి పాత్ర లేకపోయినా.. ఆమె జీవిత కథ కాబట్టి ఆమెకు రాయల్టీ సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే.. ఆమె కోర్టుకు వెళ్తే చిక్కులు వస్తాయి. మరి ఈ సినిమా కోసం లక్ష్మీపార్వతికి ఎంత సొమ్ము ఇచ్చారు. ఈ విషయంపై ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. 
lakshmis ntr lakshmi parvathi కోసం చిత్ర ఫలితం



ఈ సినిమా అనుమ‌తి కోసం ల‌క్ష్మీ పార్వతికి నిర్మాత‌ దాదాపు కోటిన్నర చెల్లించార‌నే వార్తలు వస్తున్నాయి. సెన్సార్ స‌మ‌యంలో ఈమె నుంచి ఎలాంటి లీగల్ ఇబ్బందులు రాకుండా ముందే జాగ్రత్త ప‌డుతున్నారట ప్రొడ్యూసర్. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే హాట్ టాపిక్ కావడంతో వసూళ్లు బాగానే ఉంటాయని ఊహిస్తున్నారు. 
lakshmis ntr lakshmi parvathi కోసం చిత్ర ఫలితం


అందుకే కేవలం కథాపరమైన హక్కుల కోసమే లక్ష్మీపార్వతికి కోటిన్నర సొమ్ము ఇచ్చారట. దీని వల్ల లక్ష్మీపార్వతికి రెండు విధాలా లాభం. ఓవైపు ఆమె కథకు ప్రాచుర్యం లభిస్తోంది. ఆమెకు జరిగిన అన్యాయం ప్రజలకు తెలుస్తోంది. మరోవైపు కోటిన్నర సొమ్మూ వస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: