కొన్నాళ్ళక్రితం సరైన సక్సెస్ లు లేని యువరత్న బాలకృష్ణకు, మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయనతో కలిసితీసిన సింహ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించి బాలకృష్ణ కెరీర్ కు మంచి బూస్ట్ ని ఇచ్చిందని చెప్పాలి. ఇక ఆ తరువాత వారిద్దరి కలయికలో వచ్చిన రెండవ సినిమాగా వచ్చిన లెజెండ్ కూడా సూపర్ హిట్ సాధించి, ఆ ఇద్దరి కాంబోకి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చిందనే చెప్పాలి. ఇక వారిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడవ సినిమా అతి త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని కూడా తప్పకుండా విజయవంతం చేయాలని దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ పై తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారట. 


పైగా ఇటీవల వినయ విధేయ రామ సినిమా పరాజయంతో బోయపాటి, ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల పరాజయలతో బాలకృష్ణ ఎంతో ఢీలా పడ్డారు. అందువల్లనే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాలో బాలకృష్ణ ఒక ఊరి పెద్దగా నటిస్తున్నారని, అలానే ఆ ఊరిలో ఎదురయ్యే ఒక సమస్యను ఎదుర్కోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి శత్రువుల పై ఏవిధంగా పోరాడి గెలిచాడు అనేది ప్రధాన ఇతివృత్తంగా చెప్తున్నారు. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే, సింహ మరియు లెజెండ్ మాదిరి ఈ సినిమాలో కూడా బాలకృష్ణ మరొక్కసారి ద్విపాత్రాభినయం చేయనుండడం. 


ఇక సినిమాలో రెండు పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని, అంతేకాదు ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ డైలాగ్స్, అలానే బోయపాటి మార్క్ మాస్ మరియు యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉండనున్నాయని సమాచారం. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదుగానీ, ఒకవేళ నిజమే అయితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి పండుగే అని చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: