తెలుగు ఇండస్ట్రీలో డి రామానాయుడు వారసుడిగా ‘కలియుగ పాండవులు’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి వెంకటేష్.  ఇండస్ట్రీలో ఆయనను విక్టరీ వెంకటేష్ గా పిలుస్తారు.  కెరీర్ బిగినింగ్ లో యాక్షన్ తరహా చిత్రాల్లో నటించిన వెంకటేష్ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారారు.  ఇప్పటి వరకు ఎన్నో ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ చిత్రాల్లో నటించిన వెంకటేష్ ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నారు.  తాజాగా ఆయన కూతురు   ఆశ్రీత వివాహ మహోత్సవ కార్యక్రమం జైపూర్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.   

హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రీత వివాహం జరుగుతున్నది. ఈ వివాహ మహోత్సవానికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం.  ఈ వివాహ మహోత్సవాన్ని జైపూర్ భారీ ఎత్తున సన్నాహాలు చేశారు.  ఈ వేడుకల్లో రానా, నాగచైతన్య, సమంతలు తెగ సందడి చేసినట్లు సమాచారం.

అయితే ఈ వివాహ మహోత్సవ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు.  అయితే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో వెంకటేష్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  ఈ నేపథ్యంతో ఆయన ఆశ్రీత, వినాయక్ వివాహ వేడుకకు విచ్చేశారు. సల్మాన్, వెంకటేష్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: