సినీ నటుడు, ప్రస్తుతం నరసాపురం నుంచి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ‘జనసేన’పార్టీ తరుపు నుంచి విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.  మెగాస్టార్ చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టిన నాగబాబు నటుడిగా, నిర్మాతగా వ్యవహరించారు.  ఆ మద్య నిర్మాతగా బాగా నష్టపోయిన సమయంలో పవన్ కళ్యాన్ చేయూత ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.  ప్రస్తుతం నాగబాబు ‘జబర్ధస్గ్’ కామెడీ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  నరసాపురం పార్లమెంటు స్థానం పోటీ చేస్తున్న నాగబాబు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగిస్తూ ప్రత్యర్థులకు దీటుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.  

Image result for varun tej

ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రజలకు సేవ చేసేందుకే తాను ప్రజాక్షేత్రంలోకి వచ్చానని..ఇంత కాలం అన్ని పార్టీల పాలన చూశారని..ఒక్కసారి జనసేన పాలన చూసి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు.  ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తమకు ఆ కష్టనష్టాలు ఎలా ఉంటాయో తెలుసని అన్నారు.  ప్రస్తుతం సినీ గ్లామర్ ఉపయోగించుకోకుండా ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే పవన్ కళ్యాన్ ఎండనకా..వానకా ఎలాంటి కష్టాల్ని లెక్క చేయక ప్రజా క్షేమమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడని అన్నారు. 

Related image

ఈ సందర్భంగా తన కోసం కుమారుడు వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొంటాడని, త్వరలోనే వస్తాడని తెలిపారు. కార్యకర్తలంతా సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలని, ఇతర కార్యకర్తలను కూడా సోషల్ మీడియా ద్వారా కలుపుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.  ఓ వార్డ్ కౌన్సిలర్ గా గెలిస్తే కొంత మాత్రమే చెయ్యొచ్చని, ఎమ్మెల్యేగా గెలిస్తే మరికొంచెం ఎక్కువగా చెయ్యొచ్చని, అదే ఎంపీగా గెలిస్తే ఎంతో చెయ్యొచ్చని నాగబాబు వివరించారు.  తాను గెలిస్తే నరసాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: