బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి పేరు కేవలం జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయికి కూడా ఎగబాకింది. ఇక ఆ సినిమాల తర్వాత ఆయన ఎటువంటి ప్రాజెక్ట్ మొదలు పెడతారని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తు వచ్చారు. ఇక అనుకున్న విధంగా మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్ ని, ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ ని హీరోలుగా పెట్టి, ఒక భారి మల్టిస్టారర్ కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఇక ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ఆర్ గా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి, సినిమా కథ, కథనాలు అల్లూరి సీతారామరాజు, కొమరంభీం జీవిత కధల ఆధారంగా తీసుకుని తెరకెక్కించడం జరుగుతోందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. 


అంతేకాక ఈ సినిమాలో హీరోయిన్స్ గా  బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ ని తీసుకుంటున్నట్లు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాక ఈ సినిమాలో మరో ప్రత్యేకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తీసుకుంటున్నట్లు రాజమౌళి మీడియాకు తెలిపారు. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించే హీరోయిన్ కోసం కూడా రాజమౌళి టీమ్ వెతుకులాట ప్రారంభించిందని, అయితే ఫైనల్ గా ఆయన సరసన నటించే హీరోయిన్ గా ఆయన భార్య కాజోల్ నే ఎంపిక చేయడం జరిగిందని సమాచారం.

నిజానికి ఆ పాత్ర కోసం మొదట్లో అనుష్క లేదా కీర్తి సురేష్ ని తీసుకుందాం అనుకున్నప్పటికీ, పాత్ర యొక్క ఔచిత్యాన్ని బట్టి కాజోల్ అయితే కరెక్ట్ అని చిత్ర యూనిట్ భావించిందట.  ఇకపోతే నిజజీవిత భార్యాభర్తలైన అజయ్ దేవగన్ మరియు కాజోల్, ఇదివరకు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ, పాన్ ఇండియా అపీల్ ఉన్న ఇంత భారీ బడ్జెట్ చిత్రంలో నటించడం మాత్రం ఇది తొలిసారి. ఇక ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ మేటర్ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. అయితే ప్రస్తుతం పుకారు అవుతున్న ఈ వార్తపై నిజానిజాలు తెలియాలంటే ఆర్.ఆర్ ఆర్ మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసిందే మరి


మరింత సమాచారం తెలుసుకోండి: