తెలుగు సినిమాలకు సంక్రాంతి పెద్ద పండుగ.  హిట్ కొట్టాలన్న రికార్డ్ తిరగరాయాలన్నా సంక్రాంతినే టార్గెట్ చేసుకుంటారు. ఇక టాలీవుడ్లో టాప్ స్టార్స్ అందరూ ఏదో టైం లో సంక్రాంతి సినిమాలు రిలీజ్ చేసిన వారే. ప్రభాస్ కి మాత్రం ఆ ముచ్చట ఇంతవరకూ తీరలేదు. అది వచ్చే ఏడాది తీర్చేసుకుంటాడుట. 


ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహూ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేకింగ్ వీడియోలు షేడ్స్ ఆఫ్ సాహూ 1, 2 రూపంలో అన్ని వర్గాల్ని మెప్పించాయి. యువీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 250కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. దీంతోపాటు ప్రభాస్ తన కెరీర్‌లో 20వ సినిమానూ పూర్తి చేసేస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.


యూరోప్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక అందమైన ప్రేమకథా చిత్రంగా అది తెరకెక్కుతోంది. ప్రభాస్ గెటప్ పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటలీలో ఇదివరకూ ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. సాహూ ఆగస్టులో రిలీజవుతుంటే, వచ్చే ఏడాది సంక్రాంతికి జాన్ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్.



మరింత సమాచారం తెలుసుకోండి: