టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ పెరిగి పోవడంతో వారి సినిమాల కలక్షన్స్ మధ్య పోటీ మాత్రమే కాకుండా వారు ఉపయోగించే కార్వాన్ ల విషయంలో కూడ విపరీతమైన పోటీ ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ కార్వాన్ ల విషయంలో మహేష్ కార్వాన్ కు ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది. 
Allu Arjun to take a Bold Step for his Next
అనేక విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన మహేష్ కార్వాన్ పై అనేక కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మహేష్ రికార్డ్ ను అల్లు అర్జున్ బ్రేక్ చేసాడు. తెలుస్తున్న సమాచారం మేరకు దక్షిణ భారతదేశంలో ఏటాప్ హీరోకు లేని స్థాయిలో అల్లు అర్జున్ తన కొత్త కార్వాన్ కు డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. 

అల్లు అర్జున్ స్ట్రాటజీని అర్ధం చేసుకోలేకపోయిన నాని !
ఈ కార్వాన్ కోసం బన్నీ 7 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా కేవలం ఈ కార్వాన్ లోని ఇంటీరియర్ కోసం అల్లు అర్జున్ సుమారు 3 కోట్లు ఖర్చు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్యనే బన్నీ ముంబాయి వెళ్లి అక్కడ తన కార్వాన్ డిజైన్ చేస్తున్న సంస్థతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
Allu Arjun Upcoming Movies
ఈ కార్వాన్ పై అల్లు అర్జున్ మార్క్ ఉండేలా ‘AA’ సిగ్నేచర్ ఉంటుంది అని టాక్. త్వరలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్ బన్నీల సినిమా షూటింగ్ కి ఈ కార్వాన్ ను ఉపయోగిస్తారని అంటున్నారు. దీనితో ఇప్పుడు మహేష్ తన ప్రస్తుత కార్వాన్ మార్చివేసి బాలీవుడ్ హీరోల స్థాయిలో 10 కోట్ల విలువ చేసే కొత్త కార్వాన్ ను బన్నీకి పోటీగా ఆర్డర్ ఇస్తాడేమో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: